తెలంగాణ

TG: తెలంగాణలో అన్నం తినే పరిస్థితి లేదా? కిలో రూ.90కి చేరిన సన్న బియ్యం!

కూరగాయలు, నూనెల రేట్లు పెరిగితేనే సర్దుకుపోయే సామాన్యుడికి, ఇప్పుడు రోజూ తినే నాలుగు మెతుకులు కూడా గొంతులో పచ్చివెలక్కాయలా మారుతున్నాయి. తెలంగాణలో సన్న బియ్యం ధరలు గతంలో ఎన్నడూ లేని రీతిలో భగ్గుమంటూ పేద, మధ్యతరగతి వర్గాల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కేవలం కొద్ది నెలల క్రితం వరకు రూ. 50 నుంచి రూ. 55 మధ్య లభించిన సన్నాలు, ఇప్పుడు అమాంతం పెరిగి ప్రాంతాన్ని బట్టి కిలో ఏకంగా రూ. 65 నుంచి రూ. 90 దాకా పలుకుతున్నాయి. పండుగల సీజన్ ముంగిట ప్రధాన ఆహారమైన బియ్యం రేట్లు ఇలా ఆకాశాన్నంటుతుండటం గృహిణుల నెలవారీ బడ్జెట్‌ను పూర్తిగా తలకిందులు చేస్తోంది.