తెలంగాణ
Telangana:రాష్ట్రంలో విద్యుత్ కోతలకు త్వరలో చెక్-రేవంత్ రెడ్డి కేబినెట్ కీలక నిర్ణయం!!
రాష్ట్రంలో రూ.28 వేల కోట్లతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్సిస్టమ్(BESS) ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. 4 వేల మెగావాట్ల బీఈఎస్ఎస్ ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలవనుంది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల పీక్ టైమ్లో కరెంట్ కోతలు లేకుండా గ్రీన్ఎనర్జీ వాడుకునేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 375 మెగావాట్ల బీఈఎస్ఎస్ కరెంట్ గ్రిడ్ కు అనుసంధానం చేశారు.
