తెలంగాణ
రేవంత్, కేసీఆర్‌ల భూముల వ్యవహారాలు.. అసలు లెక్కలు చెప్తారా..?
తెలంగాణ శాసనసభ వేదికగా మొదలైన 22A నిషేధిత భూముల రగడ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. "మీరు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశారు" అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గర్జిస్తే.. "మీ కుటుంబానికే 300 ఎకరాలకు పైగా లెక్కల్లో లేని ఆస్తులున్నాయి" అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా ముందు ఎదురుదాడికి దిగారు. నిజానికి ఇరుపక్షాలు విసిరిన లెక్కల బాంబులతో సామాన్య జనాలు విస్తుపోతున్నారు. అయితే ఈ ఆరోపణల పర్వంలో నాయకులు చెబుతున్నది ఎంత? రికార్డుల వెనుక దాగిన అసలు నిజాలెంత? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
