తెలంగాణ
తెలంగాణ యువత కోసం రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. లెఫ్టినెంట్ జనరల్ తో కీలక భేటీ!..
హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఆర్మీ నియామకాలకు ముందు యువతకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. దీనికి ఆర్మీ సానుకూలంగా స్పందించింది. మరోవైపు వరదలు, విపత్తుల సమయంలో రెస్క్యూ, సహాయక చర్యల్లో ఆర్మీ మరింత చురుగ్గా పాల్గొనాలని సీఎం కోరగా.. ప్రత్యేక చొరవ తీసుకుంటామని లెఫ్టినెంట్ జనరల్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మేజర్ జనరల్ శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
