తెలంగాణ

Telangana RERA: కొరడా ఝళిపించిన రెరా.. ఆ 4 ప్రాజెక్టులపై భారీ జరిమానా

Telangana RERA: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా-TG RERA రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం) కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన 4 ప్రాజెక్టులపై భారీ జరిమానాలు విధించింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు చేపట్టిన AV Infracon Pvt Ltv కు చెందిన AVs East Residency ప్రాజెక్ట్ పై 2లక్షల 83వేల 140 రూపాయల ఫైన్ వేసింది. AVs West Heights ప్రాజెక్ట్ పై రూ.14,84,184 జరిమానా విధించింది. మరోవైపు సేల్ అగ్రిమెంట్ చేయకుండా 25శాతం డబ్బులు వసూలు చేసిన అదూరి ఇన్ ఫ్రాకు రూ.6,77,966 భారీ జరిమానా విధించింది.