తెలంగాణ

TG: రేషన్ బియ్యంతో పాటు పప్పు, నూనె.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!

TG: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పేందుకు రెడీ అవుతోంది. ఇకపై రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే కాకుండా, సామాన్యుల వంటింట్లో రోజూ వాడే నిత్యావసర సరుకులన్నింటినీ అందించే ఆలోచనలో సర్కార్ ఉంది. మార్కెట్లో సరుకుల రేట్లు మండిపోతుండటంతో పేద కుటుంబాలకు కాస్త ఊరటనిచ్చేందుకు బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె, గోధుమపిండి లాంటి సరుకులను రేషన్ ద్వారా పంచే విషయంపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఆఫీసర్లతో జరిపిన కీలక భేటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రేషన్ లబ్ధిదారులకు బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారంపొడి వంటి సరుకులు ఇస్తే బాగుంటుందనే ప్రతిపాదనపై అధికారులతో ఆయన చర్చించారు.