తెలంగాణ
బిగ్ అలర్ట్.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Rain Alert : బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం తెలంగాణ వైపు వేగంగా దూసుకొస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్ష బీభత్సం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ముసురు పట్టిన వాతావరణం రానున్న 48 గంటల్లో మరింత ఉగ్రరూపం దాల్చనుందని చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే 12 గంటల వ్యవధి అత్యంత కీలకమని, ఇది తీవ్ర వాయుగుండంగా మారి నేలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఈ వాతావరణ మార్పులతో ప్రధానంగా 8 జిల్లాల ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్తో పాటు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
