TG: రూ. 2 కోట్ల లంచం ఆరోపణలు అవాస్తవం.. ఒవైసీకి తెలంగాణ జైళ్ల శాఖ కౌంటర్!
TG: హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన సంచలన ఆరోపణలను తెలంగాణ జైళ్ల శాఖ తీవ్రంగా ఖండించింది. చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ రూ. 2 కోట్ల లంచం తీసుకుని నిందితుడికి బెయిల్ ఇప్పించారంటూ ఒవైసీ చేసిన కామెంట్స్‌లో ఎలాంటి వాస్తవం లేదని తెలంగాణ జైళ్ల శాఖ స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడి విడుదలకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి అధికారులు అఫీషియల్‌గా తెరదించారు.చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణలపై జైళ్ల శాఖ అధికారులు సూటిగా స్పందించారు. "ఏదైనా కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసే అధికారం కేవలం కోర్టులకు మాత్రమే ఉంటుంది. లా ప్రకారం సంబంధిత న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తేనే జైలు నుంచి విడుదల చేస్తాం. ఇందులో జైలు అధికారుల ప్రమేయం గానీ, బెయిల్ ఇచ్చే విచక్షణాధికారం గానీ ఉండదు. రూల్స్ ప్రకారం కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాతే ఖైదీని విడుదల చేశాం తప్ప, లంచం తీసుకుని బయటకు పంపే ప్రశ్నే తలెత్తదు" అని అధికారులు స్పష్టం చేశారు.
