తెలంగాణ
TG: తెలంగాణలో డిజిటల్ విప్లవం దిశగా తపాలా శాఖ: సీపీఎంజీ డీఎస్‌వీఆర్ మూర్తి
TG: ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 15 వరకు జాతీయ తపాలా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, ‘‘ఒకే తపాలా వ్యవస్థ - అపరిమిత అవకాశాలు’’ అనే నినాదంతో టెక్నాలజీ ఆధారిత సేవలను విస్తరిస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (సీపీఎంజీ) డీఎస్‌వీఆర్ మూర్తి వెల్లడించారు. హైదరాబాద్‌లోని డాక్ సదన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 6,219 తపాలా కార్యాలయాలు, 17,137 మంది సిబ్బందితో నిరంతర సేవలు అందిస్తున్నామని తెలిపారు. రోజ్‌గార్ మేళా ద్వారా తెలంగాణ సర్కిల్లో 1,123 మంది జీడీఎస్‌లతో కలిపి మొత్తం 1,272 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.సాంకేతిక మార్పుల్లో భాగంగా ఐఐటీ హైదరాబాద్, ఇస్రో సహకారంతో 10 అక్షరాల జియో-కోడెడ్ ‘డిజిపిన్’, స్వదేశీ ఏపీటీ 2.0 వేదికలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
