తెలంగాణ

కేసీఆర్‌పైనే రేవంత్ గురి.. కేటీఆర్, హరీశ్‌లను లైట్ తీసుకోవడం వెనుక అసలు స్కెచ్ ఇదే!

Telangana Politics : కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు దాడి చేస్తున్న వేళ, సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజూ రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నది కేటీఆర్, హరీశ్ రావులే అయినప్పటికీ.. రేవంత్ మాత్రం వారిని పూర్తిగా పక్కనపెట్టి ఫామ్‌హౌస్‌లో సైలెంట్‌గా ఉంటున్న గులాబీ బాస్ కేసీఆర్‌నే పదే పదే తెరపైకి తెస్తున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే దీని వెనుక ఒక వ్యూహాత్మకమైన మైండ్ గేమ్‌తో పాటు దీర్ఘకాలిక రాజకీయ ఎత్తుగడ దాగి ఉందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రమే. మీడియా సమావేశాలు, ధర్నాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఈ ఇద్దరు నేతలు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు గమనిస్తే, వీరిద్దరి విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎక్కడ కనిపించడం లేదు.