తెలంగాణ
Telangana Politics: హరీష్ అడ్డాపై రేవంత్ కన్ను.. గులాబీ కోటలో పోటాపోటీ రచ్చ!
Telangana Politics: సిరిసిల్లలో కేటీఆర్కు చెక్ పెట్టిన జోష్లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్ఎస్కు అత్యంత పటిష్టమైన కంచుకోట సిద్దిపేటపై దృష్టి సారించింది. మాజీ మంత్రి హరీష్ రావు స్వంత ఇలాకాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సిద్దిపేటలో గులాబీ జెండాను పీకేసి కాంగ్రెస్ జెండా ఎగరేసిన నేతకు ఏకంగా మంత్రి పదవి ఇస్తానంటూ గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఓపెన్ ఆఫర్ను గుర్తుచేస్తూ హస్తం శ్రేణులు కదనరంగానికి దిగుతున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి సభ ఖరారయ్యేలోపే తన పట్టును నిరూపించుకునేందుకు హరీష్ రావు శరవేగంగా పావులు కదిపారు. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘దశాబ్ది ఉత్సవాల’ పేరిట మూడు రోజుల పాటు భారీ కార్యక్రమాలను ప్రకటించారు.
