తెలంగాణ

Telangana Politics: హస్తంలో కుర్చీలాట.. ఎంపీకి చెక్ పెట్టేలా మంత్రుల స్కెచ్?

Telangana Politics: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు మూడేళ్లు గడుస్తున్నా.. నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం చల్లారడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి పరిధిలో సీనియర్ మంత్రులు, స్థానిక ఎంపీ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దూకుడుకు కళ్లెం వేసి, లోక్‌సభ సెగ్మెంట్‌పై ఆయన పట్టును బలహీనపరిచేలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉమ్మడిగా వ్యూహాత్మక స్కెచ్ వేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు కీలక ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వచ్చి ఎంపీని క్రమంగా ఐసోలేట్ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎంపీ వంశీకృష్ణ తండ్రి, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబానికి జిల్లాలో బలమైన కేడర్, పట్టు ఉండటం ఇతర మంత్రులకు మింగుడుపడటం లేదన్నది బహిరంగ రహస్యమే.