తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులపై రాజకీయం.. పంపిణీ నిలిపివేయాలని డిమాండ్!..

ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో కార్డులపై ప్రధాని మోడీ ఫోటో పెట్టకపోవడం పట్ల తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రానిదే సింహభాగమని అలాంటప్పుడు ఎవని అయ్య జాగీరు అని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు మాత్రమే వేసుకుంటున్నారు? అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. అలాంటప్పుడు మోడీ ఫోటో పెట్టకపోవడం కేంద్రాన్ని అవమానించడమే అని మండిపడ్డారు.