తెలంగాణ
రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పట్టినట్టేనా?
సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని ఆయనతో పదేపదే మాట్లాడుతూ కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. తన ప్రసంగం ప్రారంభంలో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ప్రస్తావించగానే సభలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. దీంతో సీఎం కాసేపు తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.ఇటీవల వరకు రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొన్ని సందర్భాల్లో సీఎంపైనే నేరుగా విమర్శలు చేసిన నేతగా రాజగోపాల్ రెడ్డి పేరు వినిపించింది.
