తెలంగాణ

కేసీఆర్ ఫామ్ హౌస్ పై విచారణ.. రేవంత్ కు కలిసొస్తుందా..?

Telangana Politics: తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఒకటే చర్చ.. ఎర్రవల్లి ఫాంహౌస్‌ చుట్టూ రేవంత్ రెడ్డి సర్కార్ బిగిస్తున్న ఉచ్చు కాంగ్రెస్‌కు రాజకీయ లాభాన్ని తెచ్చిపెడుతుందా? లేక గతంలో పక్క రాష్ట్రంలో జరిగిన సీన్ రిపీట్ అయి గులాబీ బాస్‌కి తిరుగులేని ప్రజా సానుభూతిని కట్టబెడుతుందా? ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా, వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న ఈ దూకుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌కు తిరుగులేని అధికారాన్ని ఖాయం చేస్తుందా లేక చేతులు కాల్చుకునే ప్రమాదంలో పడేస్తుందా అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి.తెలుగు నేలపై మాజీ ముఖ్యమంత్రులపై విచారణలు, అరెస్టుల వ్యవహారాలు ఎప్పుడూ ఊహించని ఫలితాలనే ఇచ్చాయి. గతంలో ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని జైలుకు పంపినప్పుడు అధికార పక్షం అంతా తమ చేతుల్లోనే ఉందనుకుంది. కానీ తెరవెనుక ప్రజల్లో రేకెత్తిన సానుభూతి సునామీగా మారి కూటమిని రికార్డు మెజారిటీతో అధికార పీఠంపై కూర్చోబెట్టింది.