తెలంగాణ

Telangana Politics: మాజీలైనా.. తాజాలమన్నట్టే పెత్తనం! పవర్ పోయినా.. పోజులు తగ్గని బ్యాచ్

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ‘ఫెవికాల్ బ్యాచ్’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పదవిలో ఉన్నన్నాళ్లూ అధికారం అనుభవించిన కొందరు నేతలు.. పదవీ కాలం ముగిసి మాజీలుగా మారినా కుర్చీలను వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నారట. "పదవి పోయినా పవర్ మాదే.. కుర్చీ పోయినా పెత్తనం మాదే" అన్నట్లుగా వ్యవహరిస్తూ కార్పొరేషన్లలో ఇంకా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మాజీలు అయ్యాక కూడా ప్రజాధనంతో దర్జాగా జల్సాలు చేస్తూ, అధికారిక హోదాల్లో తిరుగుతున్నారన్న విమర్శలు ఇప్పుడు సచివాలయ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.