తెలంగాణ
Telangana Politics: దామోదర వర్సెస్ కాంతారావు.. హోటల్ లాబీలో అసలు ఏం జరిగింది!
Telangana Politics: ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రానికి వ్యతిరేకంగా నిర్వహించిన 'ఇండియా' కూటమి ర్యాలీ కోసం పార్టీ నేతలంతా ఐక్యంగా ఢిల్లీకి వెళ్లారు. అంతా సజావుగానే సాగిందనుకుంటున్న సమయంలో.. ఓ విలాసవంతమైన స్టార్ హోటల్ లాబీ వేదికగా చోటుచేసుకున్న హైడ్రామా గాంధీ భవన్ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.ర్యాలీ ముగిసిన అనంతరం తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హోటల్ లాబీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ గుంపులో రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. అదే టైంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ లాబీ మీదుగా నడుచుకుంటూ అటువైపు వచ్చారు.
