తెలంగాణ

Telangana Politics: అంగట్లో నామినేటెడ్ పోస్టులు.. సొసైటీ చైర్మన్ పీఠానికి రూ.20 లక్షల రేటు!

రాజకీయాల్లో పదవి అంటే ప్రజాసేవకు దక్కిన గుర్తింపు. పార్టీ కోసం చెమటోడ్చిన కార్యకర్తలకు దక్కే గౌరవం. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మాత్రం పదవులంటే పక్కా కమర్షియల్ బిజినెస్‌గా మారిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. "క్యాష్ కొట్టు.. కుర్చీ పట్టు.. ఆలసించిన ఆశాభంగం" అన్నట్లుగా అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం సాగుతోందని ఆ పార్టీ నాయకలే చెబుతున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ సిద్ధాంతాలు పక్కనపెట్టి, ప్రతీ నామినేటెడ్ పోస్టుకూ బహిరంగంగానే రేటు కట్టి అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టారన్న ఆరోపణలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో సంచనలంగా మారింది.