తెలంగాణ

Telangana Politics: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. రాష్ట్రంలో ఢిల్లీ దళాల మోహరింపు..!

Telangana Politics: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు తెలంగాణే సరైన వేదిక అని బీజేపీ అధిష్ఠానం గట్టిగా నిర్ణయించుకుంది. ఇన్నాళ్లూ కేవలం రాష్ట్ర స్థాయి నేతల ప్రకటనలు, నిరసనలతో సరిపెట్టిన బీజేపీ హైకమాండ్.. ఇప్పుడు గేరు మార్చి నేరుగా ఢిల్లీ సైన్యాన్ని తెలంగాణ గడ్డపై మోహరిస్తోంది. జాతీయ ఎన్నికల వ్యూహకర్తలు, సంఘటనా నిపుణులు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రంలోనే తిష్టవేసేలా పక్కా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన "ఇంకా మా ఆట మొదలే కాలేదు" అన్న మాటల వెనుక ఉన్న అసలు ఆయుధం.. ఢిల్లీ పెద్దలు పంపబోతున్న ఈ ప్రత్యేక దళాలేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నే ప్రధాన కార్యాలయంగా చేసుకుని వ్యూహాలు రచిస్తుంది. కానీ, బీజేపీ ఈసారి రూటు మార్చింది. తెలంగాణ రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉత్తర తెలంగాణ నడిబొడ్డు ‘వరంగల్’ను తన ప్రధాన కార్యస్థానంగా ఎంపిక చేసుకుంది. బీజేపీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి దశరథ్ పండుగ ముగియగానే నేరుగా వరంగల్‌లోనే మకాం వేయనున్నారు.