తెలంగాణ
అసెంబ్లీలో హిట్ ఎక్కిన రాజకీయం.. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!..
తెలంగాణ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ తరువాత ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే బీఆర్ఎస్ నేతల నిరసనలు వివాదాస్పదంగా మారాయి. గులాబీ నేతలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఆ ఎమ్మెల్సీ పై వేటు వేయాలంటూ మంత్రులు ఫిర్యాదు చేసారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.. ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది.
