తెలంగాణ
అలర్ట్.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
TG : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 9తో ముగియాల్సిన అప్లికేషన్ ప్రక్రియను మరో వారం రోజుల పాటు కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) మంగళవారం వెల్లడించింది.
