కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్న తెలంగాణ పోలీసుశాఖ : కేటీఆర్
1000 రోజుల కాంగ్రెస్ పాలనపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం నిరాశ నిస్పృహల్లో ఉందని, అందుకే ప్రతిరోజూ అటెన్షన్ డైవర్షన్‌కు పాల్పడుతోందని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇంటిమీద దాడి చేశారని, ప్రాణాలకు లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడి ఇంటిపైన దాడి జరగడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వారి మీద కేసులు ఎందుకు పెట్టలేదని పోలీసుశాఖను నిలదీశారు. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ లోపల 15 మంది గుర్తుతెలియని దుండగలు..తన పీఆర్వో, పీఏ మీద దాడికి యత్నించారని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లో దాడికి ప్రయత్నించింది గుండాలా? పోలీసులా? మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు ఎవరో తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పోలీస్ శాఖ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పని చేస్తుందని ఆరోపించారు.
