తెలంగాణ
TG: 8 లక్షల మంది పోడు రైతులకు పట్టాలివ్వాల్సిందే.. : గోడం గణేష్
TG: నీరు, అడవి, నేల కోసం నిజాం సర్కార్‌పై పోరాడి ప్రాణాలర్పించిన ఆదివాసీల దేవుడు కొమురం భీమ్ 86వ వర్ధంతి సభ జోడేఘాట్‌లో జరిగింది. తుడుం దెబ్బ నాయకులతో పాటు పలువురు ప్రజాసంఘాల నేతలు అక్కడ భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న 8 లక్షల మంది అర్హులైన పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. "ఒకపక్క ఆదివాసీల ఆత్మగౌరవం అంటూ గొప్పలు చెబుతూనే.. మరోపక్క అడవుల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులను ఫారెస్ట్ ఆఫీసర్లు వేధిస్తున్నారు.
