తెలంగాణ

చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..

కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నట్టుగా మాట్లాడటంతో పాటు.. ఆయన ఇంటి వద్ద వెయ్యి డప్పులు కాదు.. ఇంకా ఎక్కువ డప్పులు తీసుకెళ్లి చావు డప్పు కొడతామని శంకర్ వ్యాఖ్యానించారు.రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే. కానీ.. మరణాన్ని కోరుకునే స్థాయికి రాజకీయాలు దిగజారడం మాత్రం సరైన పద్ధతి కాదనే విమర్శలు వస్తున్నాయి.గతంలో తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు ఉన్నప్పటికీ, ఒక పరిమితి ఉండేది. సిద్ధాంత పరమైన విభేదాలు ఎంత ఉన్నా, వ్యక్తిగత విద్వేషాలకు తావుండేది కాదు. కానీ నేటి పరిణామాలు ఆ సరిహద్దులను చెరిపేస్తున్నాయి. అధికారం కోసం, పార్టీ మైలేజ్ కోసం ఎంతటి నీచమైన ఎత్తుగడలైనా వేయడానికి వెనుకాడటం లేదనే ఆరోపణలున్నాయి..