తెలంగాణ
బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్కు బిగ్ ఛాలెంజ్!!..
తెలంగాణ రాజకీయాల్లో అరెస్టుల వ్యవహారం మరోసారి కాక రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఫేక్ కేసులతో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. అరెస్టులు, నిర్బంధాల్లో మాత్రం సక్సెస్ అయిందని ఎద్దేవా చేశారు. 420 హామీలు అమలు చేస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతామని కేటీఆర్ సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ మరింత ముదిరింది.
