తెలంగాణ

తెలంగాణ కౌలు రైతులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్!..

తెలంగాణలో కౌలు రైతుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. భూమిని సాగు చేస్తున్నా.. రైతుగా గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న పరిస్థితి. రైతు భరోసా, రైతు బీమా, పంట రుణాలు మాత్రమే కాదు.. పంటకు అవసరమైన ఇన్‌పుట్ సబ్సిడీలు పొందడంలోనూ కౌలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా కౌలు రైతులకు ఈ సమస్య రావడానికి కారణం.. భూమిని కౌలుకు తీసుకున్న రైతు దగ్గర సాధారణంగా భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఉండవు. ఆ పత్రాలు భూ యజమాని దగ్గరే ఉంటాయి. అయితే కౌలుదారుడికి పత్రాలు ఇస్తే.. భవిష్యత్తులో తన భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందనే భయం కొందరు పట్టాదారుల్లో ఉంది. పాత కౌలు చట్టాలపై ఉన్న అపోహలు, సరైన అవగాహన లేకపోవడం ఈ సమస్య తలెత్తుతుంది..