తెలంగాణ

తెలంగాణ రియల్ ఎస్టేట్‌లో జోష్.. ఆదాయంలో భారీ పెరుగుదల!..

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఏకంగా 1,408 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. 2025లో ఇదే సమయంలో 8,706 కోట్ల రూపాయల రాబడి రాగా.. 2026లో అది 10,114 కోట్లకు చేరింది. భూముల మార్కెట్ విలువలు సవరించినా.. రిజిస్ట్రేషన్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు. జూన్, జూలైలోనూ ఆదాయం పెరుగుతూ వచ్చింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు, కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.