తెలంగాణ

కొత్త పెన్షన్లపై సీతక్క బిగ్ అనౌన్స్‌మెంట్!

TG: తెలంగాణలోని నిరుపేదలకు, ఆసరా కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త పింఛన్ల పంపిణీకి కీలక ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రాబోయే దసరా పండుగ వేళ పేదల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేలా, అక్టోబర్ నెలలోనే కొత్త పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులకు అత్యంత ఆదేశాలు జారీ చేశారు.దసరా సందర్భంగా పండుగకు ముందే అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్ సొమ్ము అందేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పెన్షన్ దరఖాస్తుల గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా, అవసరమైతే అదనపు సిబ్బందిని సైతం రంగంలోకి దించాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.