తెలంగాణ

TG: మూసీ పేరుతో రూ.1,108 కోట్ల మళ్లింపు.. రేవంత్ సర్కార్‌పై గుడ్ గవర్నెన్స్ ఫైర్!

TG: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. మూసీ పునరుజ్జీవనం ముసుగులో ఏకంగా రూ.1,108.27 కోట్ల ప్రజాధనాన్ని ఓ దేవాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి మళ్లించారంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర ఖజానా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ప్రజాధనాన్ని ఇలా దారి మళ్లించడం దారుణమంటూ నిలదీసింది. ఈ నిధుల కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డుకు లేఖ రాయడంతో సచివాలయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.