తెలంగాణ
MLC Elections: ఇదేనా పొత్తు ధర్మం టీడీపీని నిలదీస్తున్న జనసేన!!..
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మధ్య తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విభేదాలు భగ్గుమన్నాయి. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థి బరిలో నిలవగా.. టీడీపీ మాత్రం కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తోందని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.
ఏపీలో తమ మద్దతుతోనే చంద్రబాబు సీఎం అయ్యారని, మరి తెలంగాణలో తమకు టీడీపీ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కంటే పవన్ తమకు ఎక్కువ కాదనేలా టీడీపీ వ్యవహరిస్తోందంటూ జనసేన కార్యకర్తలు ఆ పార్టీ తీరును తప్పుపడుతున్నారు.
