తెలంగాణ
కాంగ్రెస్ - సీపీఐ దోస్తీకి ఎమ్మెల్సీ చిచ్చు!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే పాత నానుడి తెలంగాణ రాజకీయ వేదికపై మరోసారి ప్రత్యక్షమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేతికి చేయి కలిపి, కాంగ్రెస్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన అసలైన మిత్రపక్షం సీపీఐని పక్కనబెట్టి.. ఎన్నికల్లో తమతో కత్తులు దూసిన ప్రత్యర్థుల గడపను అధికార పార్టీ తొక్కడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా జెండా పాతాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో వ్యూహాలు రచిస్తుండగా, క్షేత్రస్థాయిలో వామపక్షాల మద్దతు కూడగట్టే క్రమంలో గాంధీభవన్ వేస్తున్న అడుగులు విమర్శలకు తావిస్తున్నాయి.
