తెలంగాణ
TBJP: ఆ ఎమ్మెల్సీ సీటుపై కమలం స్పెషల్ ఫోకస్! బరిలోకి స్వయంగా స్టేట్ చీఫ్?
తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సైరన్ మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోరును అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు అందరి కళ్లూ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ స్థానంపైనే ఉన్నాయి. ఈ కీలక సీటును ఎలాగైనా కైవసం చేసుకుని రాష్ట్రంలో తమ సత్తా చాటాలని కాషాయ దళం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపేలా స్వయంగా పార్టీ రాష్ట్ర నాయకుడే ఈ ఎన్నికల సమరంలోకి దిగుతున్నాడనే ప్రచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో కాకరేపుతోంది.
