తెలంగాణ

రాజగోపాల్​రెడ్డికి మంత్రి పదవి.. టీపీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు!!..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు, నేతల అసంతృప్తులపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అనేది ఒక మహా సముద్రం లాంటిదని, ఇక్కడ నేతలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అనుకున్న సమయానికి ఇవ్వలేకపోయామని, రాజకీయాల్లో ఓపిక అవసరమని పేర్కన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలన్నింటికీ సెప్టెంబర్ నెలలోనే పూర్తి పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.