తెలంగాణ
Vakiti Srihari: మొక్కుబడి మీటింగ్‌లకు చెక్.. మంత్రి శ్రీహరి కొత్త స్కెచ్!
Vakiti Srihari: సాధారణంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించారంటే.. మండల కేంద్రంలోనో లేదా కలెక్టరేట్‌లోనే ఓ నాలుగు గంటలు కూర్చొని, ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోతుంటారు. కానీ మక్తల్ నియోజకవర్గంలో మాత్రం మంత్రి వాకిటి శ్రీహరి ఈ మొక్కుబడి తంతుకు పూర్తిగా చెక్ పెట్టేశారు. పల్లె సీమల్లో పేరుకుపోయిన అసలైన సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు సరికొత్త కార్యాచరణతో రంగంలోకి దిగారు. అమరచింత మండలంలోని 14 గ్రామాల అభివృద్ధిపై ఆయన చేపట్టిన ప్రత్యేక సమీక్ష ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
