తెలంగాణ
TG: ఇక మీ ముంగిట్లోకే ‘మీ సేవ’ సేవలు.. కొత్త సర్వీస్‌ను స్టార్ట్ చేసిన మంత్రి శ్రీధర్‌బాబు!
TG: ప్రభుత్వ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగడం, మీ సేవ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం ఇకపై గతం కానుంది. పౌర సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విప్లవానికి తెరతీసింది. సరికొత్త సాంకేతిక సంస్కరణలతో తయారు చేసిన ‘మీ సేవ డోర్ డెలివరీ’ సేవలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాంఛనంగా స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దీనికి సంబంధించిన ఆధునిక పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు.సామాన్యులకు ఎలాంటి శ్రమ లేకుండా ఇంటి ముంగిట్లోనే ప్రభుత్వ సేవలందించేందుకు సర్కార్ అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
