తెలంగాణ
మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ మంత్రి లచ్మునా రాజ్ పెంటియా భేటీ అయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాలన, సాంకేతికత, విద్య, నైపుణ్యాభివృద్ధి, సంస్కృతి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. తెలంగాణను నమ్మకమైన భాగస్వామిగా భావిస్తున్నామని మారిషస్ మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ ఉద్యోగులకు ఆధునిక పరిపాలనపై శిక్షణ అందించాలని కోరారు. అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026కు మారిషస్ మంత్రిని శ్రీధర్ బాబు ఆహ్వానించారు. మారిషస్లో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తెలంగాణ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
