తెలంగాణ
పోలీస్ శాఖలో కీలక పరిణామాలు.. డిఐజి చౌహాన్ పై వేటు!..
డీజీపీ హెచ్చరికలు చేసిన 48 గంటల్లోనే పోలీస్ శాఖలో చర్యలు మొదలయ్యాయా? జోగులాంబ రేంజ్ డీఐజీ చౌహాన్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నలుగురు అధికారుల ప్రవర్తనలో మార్పు రావడం లేదంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యల తర్వాతే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో మరో నలుగురు డీఎస్పీలపై కూడా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
