తెలంగాణ
ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్!!..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కోర్టు విచారణకు హాజరయ్యారు. సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేసు కేసులో కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసుకు సంబంధించి కోర్టు ప్రాంగణంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ 2024 డిసెంబర్ నెలలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను A1గా పేర్కొన్నారు. దీనికి సంబంధించి గతంలో 2023 జూలై 31న కూడా ఏసీబీ కోర్టులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు.
