తెలంగాణ
ఉత్కంఠంగా జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం.. రంగంలోకి హైడ్రా!!..
తెలంగాణ పాలిటిక్స్‌లో భూముల వివాదం మళ్లీ భగ్గుమంటోంది. కేసీఆర్ కుటుంబం భూములపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణలతో మొదలైన వేడి.. ఇప్పుడు జన్వాడ వరకు చేరింది. సిద్దిపేట తర్వాత కాంగ్రెస్ నేతలు జన్వాడ ఫామ్‌హౌస్ పరిసరాల్లో పర్యటించి భూములు, నాళా ఆక్రమణలు, నిర్మాణ అనుమతులపై ప్రశ్నలు లేవనెత్తారు. హైడ్రా, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫామ్‌హౌస్ యాజమాన్యంపై ప్రదీప్‌రెడ్డి తన వాదనను వినిపించారు. దీంతో ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య జన్వాడ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్‌గా మారింది.
