తెలంగాణ
వనపర్తి కాంగ్రెస్‌లో ముదిరిన పంచాయితీ.. నేతల మధ్య వివాదంపై అధిష్టానం ఫోకస్!..
వనపర్తి కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత విభేదాలు ఇప్పుడు అధిష్టానం ముందుకు చేరాయి. ఎమ్మెల్యే మెగా రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న మాటల యుద్ధం.. తాజాగా ఫిర్యాదు దశకు చేరింది. కాంగ్రెస్, ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన మెగా రెడ్డి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ కూడా ఆరా తీశారు. చిన్నారెడ్డి వ్యాఖ్యల వీడియోలను పరిశీలిస్తున్నట్టు అధిష్టానం తెలిపింది.
