తెలంగాణ

TG: అలర్ట్.. నవంబర్ 3న ఇందిరమ్మ ఇండ్లకు లాటరీ

TG: హైదరాబాద్ నగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్లకు నవంబరు 3న లాటరీ తీయనున్నారు. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ టవర్లలో ఉన్న ఫ్లాట్లకు నవంబరు 3న డ్రా తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. ఈ ప్రాంతాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయించనున్నారు.