తెలంగాణ
తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!..
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మరింత తీవ్రం కానున్నాయి. బుధ, గురువారాల్లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల 20.4 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ముషీరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ నీరు నిలిచే ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
