తెలంగాణ

తెలంగాణలో బీజేపీ బలమెంత?.. అసెంబ్లీలో పట్టు కష్టమేనా?..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం.. అదే బలాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపించగలదా? కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే శక్తి జాతీయ పార్టీకి ఉందా? బీజేపీలోని కొంతమంది జాతీయ నాయకుల ఇమేజ్‌తో తెలంగాణలో గెలవడం ఈ పార్టీకి సాధ్యమా? లేక గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్, స్వంత నాయకత్వం, స్పష్టమైన ప్రత్యామ్నాయ పాలన అవసరమా? ప్రస్తుతం బీజేపీ ముందు ఇవే కీలక ప్రశ్నలు. మరి కమలం నిజంగా రాష్ట్రంలో రానిస్తుందా? లేక గాల్లో మేడలు కడుతుందా? అనే అంశం తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..