తెలంగాణ
అధికార కాంగ్రెస్‌లో హైటెన్షన్.. ఇద్దరు నేతలపై వేటు తప్పదా?..
అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, బహిరంగ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, పార్టీ నాయకుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి నివేదికను ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించిన కమిటీ.. కీలక అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఇప్పుడు హైకమాండ్ నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడుతుందా? అన్న చర్చ కాంగ్రెస్‌లో జోరందుకుంది.
