తెలంగాణ

తెలంగాణలో హైటెన్షన్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్!!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అసెంబ్లీ సమావేశాల తొలిరోజు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు నల్ల టీ-షర్టులతో అసెంబ్లీకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోగా.. తాతా మధు వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయనపై కేసులు నమోదు చేసిన పోలీసులు మంగళవారం తెల్లవారుజామున న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.