తెలంగాణ

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ పథకాలపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చెల్లింపులు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చట్టసభల్లో ఎలాంటి తీర్మానం లేదా ప్రత్యేక చట్టం చేయకుండానే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఈ స్కీమ్స్ అమలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో స్టే విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.