తెలంగాణ

TG: హైకోర్టు సీరియస్.. రంగనాథ్ హాజరయ్యేలా చూడాలని డీజీపీకి ఆర్డర్!

TG: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కోర్టు ధిక్కార వ్యవహారానికి సంబంధించి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ, రంగనాథ్ రాకపై సీరియస్ ఆదేశాలు జారీ చేసింది.