తెలంగాణ
మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు సీరియస్..
High Court: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూముల స్వాధీనంలో కలెక్టర్ నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బుధవారం కోర్టు విచారణకు కలెక్టర్ మను చౌదరి హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం సీరియస్ అయ్యింది. కలెక్టర్ మను చౌదరిని గురువారం ఉదయం కోర్టులో హాజరుపరచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ భూములను కలెక్టర్లు కాపాడలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
