తెలంగాణ
Telangana: తెలంగాణలో ఏసీబీ ఉక్కుపాదం.. మూడేళ్ల అవినీతి ఆస్తుల లెక్కలు ఇవే!..
తెలంగాణలో ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతోంది.. లంచగొండులు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న అవినీతి నిరోధక శాఖ వలలో తాజాగా మరో భారీ తిమింగళం పడింది.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబాబాద్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావును ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో ఏడు ప్రత్యేక బృందాలు... ఖమ్మంలోని నరసింహారావు నివాసంతో పాటు గరిడేపల్లి, మహబూబాబాద్, నేలకొండపల్లి, హైదరాబాద్లోని ఎల్బీనగర్ తో పాటు మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి.
