తెలంగాణ
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు!
TG Politics: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఆయన శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించి ఈ నిర్ణయం తీసుకుంది.
